News October 2, 2024

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్

image

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

కామారెడ్డి: సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి: DSP

image

సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కామారెడ్డి DSP నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక కర్షక్ B.Ed. కళాశాలలో సహా చట్టం 19వ వార్షిక వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలు వారికి కావాల్సిన డాక్యుమెంట్స్, FIR, ఛార్జ్ షీట్ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ MA సలీంను అభినందించారు. అనంతరం కేక్ కోసి కార్యక్రమాలకు ముగింపు పలికారు.

News October 11, 2024

నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్

image

విజయ దశమి వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చేసుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో చేసుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

News October 11, 2024

కామారెడ్డి: లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠా అరెస్ట్

image

లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి SP సింధు శర్మ శుక్రవారం తెలిపారు. రాజంపేట్ వాసి రవీందర్ తన ఇంటి వద్ద అక్రమంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు. 14 మందిని నేరస్థులుగా గుర్తించారు. 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో 9 మందిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని SP తెలిపారు.