News October 30, 2024

నిజామాబాద్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

image

నిజామాబాద్ జిల్లా ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో 14,30,316 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 7,55,072 మంది ఉండగా పురుషులు 6,75,167 మంది, ఇతరులు 77 మంది ఉన్నారు. ఇతరులు 77 మంది ఉన్నారు. ఇక 1,565 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనిపై అన్ని కార్యాలయాల్లో అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వొచ్చని అదనపు కలెక్టర్ తెలిపారు.

Similar News

News July 11, 2025

NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

image

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.

News July 11, 2025

నిజామాబాద్: వామ్మో.. డెంగ్యూ

image

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు బెంబెలెత్తిస్తున్నాయి. గత నెలలో 25 కేసులు నమోదవ్వగా ఈనెలలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డెంగీ, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలపై వైద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

News July 11, 2025

వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

image

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.