News February 1, 2025
నిజామాబాద్ జిల్లా వెదర్ అప్డేట్@8AM

నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా పోతంగల్లో 17℃, నిజామాబాద్ 17.1, మోస్రా 17.2, జకోరా 17.3, మోర్తాడ్ 17.4, యడపల్లి 17.5, సాలూరా 17.6, పల్డా, మల్లాపూర్ 17.7, గోపన్నపల్లి, ఏర్గట్ల, జానకంపేట్ 17.8, చందూర్ 17.9, మెండోరా, కొటగిరి, చిన్న మవంది, డిచ్పల్లి, చకొండూరు, కల్లూరి 18, లక్స్మాపూర్, బెల్లాల్, గన్నారం, నిజామాబాద్ పట్టణంలో 18.1℃గా నమోదయ్యాయి.
Similar News
News March 13, 2025
NZB: 651 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-1 పరీక్షకు మొత్తం 651 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు 17,546 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.
News March 13, 2025
NZB: వైన్స్ దుకాణాలు బంద్

హోలీ పండుగ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి మద్యం షాపులు మూతపడనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటలు వరకు మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ షాపులు మూతపడనుండడంతో మద్యం ప్రియులు వైన్ షాప్స్ వద్దకు పరుగులు పెడుతున్నారు.
News March 13, 2025
భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.