News May 20, 2024

నిజామాబాద్: ట్రాక్టర్, బైకు ఢీ.. ఒకరు మృతి

image

ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏనుగందుల లక్ష్మణ్(30), సునీల్ బైకుపై వెళ్తూ ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. సునీల్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 29, 2025

నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

image

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.

NZB: టీ-పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం అందుబాటులోకి తెచ్చిన టీ-పోల్ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. టీ-పోల్ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే వివరాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.