News June 21, 2024
నిజామాబాద్: తండ్రిని చంపిన కొడుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

తండ్రిని చంపిన కొడుకుకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బోధన్ 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ తీర్పునిచ్చారు. వర్నికి చెందిన వినోద్ తరచూ దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో 2021 జూన్లో దొంగతనాలు మానేయాలని చెప్పిన అతడి భార్యతో గొడపడ్డాడు. అడ్డువచ్చిన తండ్రిని కర్రతో కొట్టడంతో దూప్యానాయక్ మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పటి SI అనిల్ రెడ్డి కేసు నమోదు చేయగా గురువారం అతడికి జైలు శిక్ష పడింది.
Similar News
News November 18, 2025
నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.