News February 22, 2025

నిజామాబాద్: నగదు, బంగారం చోరీ

image

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు భారీగా నగదు, బంగారం అపహరించిన ఘటన నిజామాబాద్ నగరంలో శనివారం వెలుగు చూసింది. హాబీబ్ నగర్ కాలనీకి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లగా అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పెళ్లి కోసమని అప్పు తెచ్చిన రూ.4 లక్షల నగదు, 3 తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు.

Similar News

News December 16, 2025

NZB: తుది దశలో మహిళా ఓటర్లే కీలకం

image

NZB జిల్లాలో తుది దశలో జరిగే కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జయాపజయాలు ప్రభావితం చేసేది మహిళా ఓటర్లే. మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు.

News December 16, 2025

NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్‌లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 16, 2025

NZB: తుది దశ ఎన్నికలకు రంగం సిద్ధం

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్ కు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూడో విడుత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జర గనుంది. తుది విడుత పోలింగ్లో ఉన్న మొత్తం సర్పంచ్ స్థానాలు 165 కాగా ఇందులో 19 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు.