News February 24, 2025

నిజామాబాద్: నరేందర్ రెడ్డిని గెలిపించండి: ముఖ్యమంత్రి

image

నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డి మండలిలో పట్టభద్రుల సమస్యలపై గొంతుకను వినిపిస్తారని అన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యల వాణికి వినిపిస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 21, 2025

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, ఛైర్మన్

image

కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బీయబాణి దర్గాలో పీఠాధిపతి ఖుస్రు పాషా ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

News March 21, 2025

నల్లమడ: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

నల్లమడ మండలంలోని ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తికి పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష పడినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. 2019 మార్చి 22వ తేదీ కదిరి పోలీస్ స్టేషన్‌లో చిరంజీవిపై పోక్సో కేసు నమోదు అయిందన్నారు. అనంతపురం జిల్లా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిపై విచారణ జరిపి 20 ఏళ్ల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధించడం జరిగిందన్నారు.

News March 21, 2025

భాగస్వామికి దూరంగా ఉంటున్నారా?

image

ఒత్తిళ్లో, ఆర్థిక ఒడిదుడుకులో, అనారోగ్యాలో.. కారణాలేవైనా ఎన్నో జంటలు తమ రోజువారీ జీవితంలో దాంపత్య సుఖానికి దూరంగా ఉంటుంటాయి. అది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా వారి మధ్య దూరం పెరిగి చికాకులు తోడవుతాయని వివరిస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా పడకపై భాగస్వామి చెంతచేరి సేదతీరాలని, మరుసటిరోజుకు ఇది కొత్త ఉత్సాహాన్నిస్తుందని సూచిస్తున్నారు.

error: Content is protected !!