News November 6, 2024

నిజామాబాద్: నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు

image

ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.

Similar News

News December 11, 2024

NZB: చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీలు

image

నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం.. త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా ప్రస్తుతం పట్టణంలో ఇవి ఎవరు పెట్టారు? కారణమేంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

News December 11, 2024

NZB: UPDATE.. ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతి చెందిన వారు నిజామాబాద్‌కు చెందిన కస్తూరి ప్రమోద్, అంకడి సంజయ్ గా గుర్తించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఈ ఇద్దరు జక్రాన్ పల్లి నుంచి నిజామాబాద్ వైపు బైకుపై వెళ్తుండగా సికింద్రాపూర్ 44 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

News December 10, 2024

గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్

image

గ్రూప్-2 పరీక్ష పక్కడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 19 కేంద్రాల్లో 8,085 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్ల ఆయన తెలిపారు.