News March 18, 2025
నిజామాబాద్ : నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు
*అభివృద్ధికి SDF కింద రూపాయలు 1000 కోట్లు ఇవ్వండి: ఆర్మూర్ MLA
*టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది: ఇన్చార్జ్ మంత్రి
*పసుపు రైతుల సమస్యలు ప్రస్తావించిన: బాల్కొండ ఎమ్మెల్యే
*టూరిజం అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
*ఎడపల్లి: కుళ్లిన స్థితిలో మృతదేహం
*ఏర్గట్ల: WAY 2 NEWSతో GROUP-2 6వ ర్యాంకర్
*NZB: జలాల్పూర్ ఆలయాల్లో దొంగ చేతివాటం
Similar News
News March 19, 2025
పంట రుణాలు విరివిగా పంపిణీ చేయాలి: అ.కలెక్టర్

ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు.
News March 18, 2025
NZB: ఇంటర్ పరీక్షలకు 475 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు 2వ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు గాను 16,291 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు.
News March 18, 2025
NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు.