News January 26, 2025
నిజామాబాద్: నేడు అట్టహాసంగా పథకాల ప్రారంభం: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని సూచించారు. CS శాంతికుమారి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
నవీపేట్: కెమెరాల పని తీరును పరిశీలించిన DIEO

రెండో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న నవీపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాలల్లో కెమెరాల పని తీరును నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 9, 2025
నిజామాబాద్‌లో తగ్గిన చికెన్ అమ్మకాలు

నిజామాబాద్ జిల్లాలోని పలు కోళ్ల ఫారాలలో వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో చికెన్ అమ్మకాలు తగ్గాయి. నేడు మార్కెట్‌లో పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు స్కిన్‌తో రూ.160, స్కిన్ లెస్ రూ.220 వరకు ఉంది. వ్యాధి ప్రభావంతో ప్రజలు చికెన్ కొనేందుకు వెనుకంజ వేస్తున్నట్లు అమ్మకం దారులు తెలిపారు.
News February 9, 2025
NZB: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.