News July 16, 2024
నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు
ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
Similar News
News October 12, 2024
పండగ వేళ బోధన్‌లో కత్తిపోట్లు
దసరా పండగ వేళ బోధన్ పట్టణంలోని గాంధీనగర్లో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. కాలనీకి చెందిన రేహాన్, జావిద్, బబ్లు ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వెళ్తున్న మన్సుర్ తన గురించే వారు మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులు కేసు, దర్యాప్తు చేస్తున్నారు.
News October 12, 2024
NZB: ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లకు మెడల్స్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మెడల్స్ సాధించారు. మలేషియాలో నిర్వహిస్తున్న 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో శుభారంభం పలికారు. ఇందులో భాగంగా 35+ ఏజ్ గ్రూపులో జరిగిన లాంగ్ జంప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాగ్మారే దినేష్ గోల్డ్ మెడల్, యాష్లీ గోపి సిల్వర్ మెడల్ సాధించారు. వీరు విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఉన్నారు.
News October 12, 2024
NZB: విషాదం.. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన మల్లారం(55) అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై మశ్చేందర్ రెడ్డి తెలిపారు. గ్రామ శివారులో గల బెల్లాల్ చెరువులోకి చేపలు పట్టడానికి వల వేసే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని అన్నారు.