News July 16, 2024

నిజామాబాద్: పంచాయతీ కార్మికులకు తీపి కబురు 

image

ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. జిల్లాలోని 1,056 పంచాయతీల్లో పనిచేస్తున్న 2,909 మంది మల్టీపర్పస్ కార్మికులకు రూ.5.79కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల ఖాతాలో నగదును వెంటనే జమ చేయాలని పేర్కొంది. కార్మికులు వేతనాల కోసం నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Similar News

News October 5, 2024

NZB: హరీశ్ రావు మాట తప్పారు: మహేష్ కుమార్ గౌడ్

image

రుణ మాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.

News October 5, 2024

NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు

image

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.

News October 5, 2024

కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

image

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.