News May 4, 2024
నిజామాబాద్: పట్టపగలే ఇంట్లో చోరీ
నిజామాబాద్‌లో పట్ట పగలే చోరీ జరిగింది. వినాయక్ నగర్ 100 ఫీట్ల రోడ్‌లోని ఓ ఇంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మధు మోహన్ తన భార్యతో కలిసి శనివారం మధ్యాహ్నం కార్ షోరూమ్‌కు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 10 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీకి గురైంది. 4వ టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2024
నిజామాబాద్: ప్రజావాణిలో 70 ఫిర్యాదులు
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్‌ఛార్జ్ డీపీఓ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
News November 11, 2024
ఎడపల్లి: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడి మృతి
మూత్ర విసర్జన కోసం వెళ్లి రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారానికి చెందిన మహ్మద్ ఖాసీం (71) సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మూత్ర విసర్జన కోసం వెళ్లి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.
News November 11, 2024
నిజామాబాద్ కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్ర్య భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మౌలానా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.