News March 25, 2024

నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

image

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

Similar News

News November 14, 2024

రేపు ఎడపల్లి మండలానికి మంత్రి జూపల్లి రాక

image

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి జూపల్లి పర్యటన ఎడపల్లి మండలంలో సైతం ఉండనున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సొసైటీ ఛైర్మన్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు.

News November 13, 2024

NZB: లింబాద్రి గుట్ట బ్రహోత్సవాలకు ప్రత్యేక బస్సులు: RM

image

ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 15 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ RM జానిరెడ్డి తెలిపారు. ఆర్మూర్, నిజామాబాద్, ధర్పల్లి, సిరికొండ నుంచి లింబాద్రి గుట్టకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, భక్తులు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

News November 13, 2024

టీయూ: డిగ్రీ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులై/ఆగస్టులో జరిగిన డిగ్రీ కళాశాలల పరీక్షల ఫలితాల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు తమ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.అరుణ తెలిపారు. డిగ్రీ 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్స్ బ్యాక్ లాగ్స్ కోసం వన్ టైం ఛాన్స్ కింద అవకాశం ఇచ్చామన్నారు. వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.