News March 19, 2024
నిజామాబాద్: పరీక్ష తేదీలు వెల్లడి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి.పి.ఎడ్ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 26న ప్రారంభమై 30 తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య.ఎం.అరుణ తెలిపారు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్
www.telanganauniversity.ac.in చూడాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News December 18, 2025
NZB: మూడు దశల్లో మహిళలే ఎక్కువ

నిజామాబాద్ జిల్లాలో మూడు దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వేశారు. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా 6,15,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,49,574 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 2,65,679 మంది, ఇతరులు నలుగురు ఓటేశారు.
News December 18, 2025
నందిపేట్ టాప్.. ఆర్మూర్ లాస్ట్

NZB జిల్లాలో తుది దశ ఎన్నికల్లో ఓటింగ్ 76.45% నమోదైంది. నందిపేట్-78.7%తో ముందు వరుసలో ఉండగా ఆర్మూర్-74.77%తో చివర్లో ఉంది. ఆలూర్-76.09%, బాల్కొండ-75.05%, భీమ్గల్-76.06%, డొంకేశ్వర్-78.06%, కమ్మర్పల్లి-75.19%, మెండోరా-76.29%, మోర్తాడ్-76.44%, ముప్కాల్-77.99%, వేల్పూర్-75.841%, ఏర్గట్ల-78.64% పోలింగ్ నమోదయ్యింది. 12 మండలాల్లో 3,06,795 మందికి గాను 2,34,546 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 18, 2025
NZB: తుది దశ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తుది దశ పోరులో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో విడతలో మొత్తం 165 పంచాయతీ సర్పంచ్లకు 19 చోట్ల ఏకగ్రీవం కాగా 146 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 95 చోట్ల, బీఆర్ఎస్ 36, బీజేపీ 16, స్వతంత్రులు 18 చోట్ల సర్పంచ్లుగా గెలుపొందారు.


