News September 20, 2024
నిజామాబాద్: పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు మేలు: సీపీ

నిరంతరం వార్తలు రాసే పాత్రికేయులకు చట్టాలపై అవగాహన ఉంటే ప్రజలకు ఉపయోగపడే వీలుంటుందని సీపీ కల్మేశ్వర్ అన్నారు. నిజామాబాద్‌లో నూతన న్యాయ చట్టాలపై శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు చట్టాలను తమ చేతుల్లో లోకి తీసుకోవద్దని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. వీడీసీల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News November 2, 2025
నిజామాబాద్: ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్

ప్రజల విసృత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఈ నెల 15న కోర్టు ప్రాంగణాల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్‌పర్సన్ జీవీఎన్ భారత లక్ష్మీ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆమె ఛాంబర్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.
News November 2, 2025
NZB: ఈ నెల 3 నుంచి కళాశాలలు బంద్

రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 3వ తేదీ నుంచి NZB జిల్లాల్లోని అన్ని కళాశాలలను బంద్ పెడుతున్నామని తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శనివారం TU రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిని కలిసి బంద్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 2, 2025
నిజామాబాద్: అలసత్వ వహిస్తే ఉపేక్షించేది లేదు: బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఉద్యోగుల ప్రమోషన్‌లలో రిజర్వేషన్ అమలుపై కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. భవానిపేట, గొరెగామ్‌లలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.


