News April 29, 2024

నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 29 మంది

image

నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ సందర్భంగా 10 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిగతా 32 మంది అభ్యర్థుల్లో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News January 11, 2025

NZB: ఎంపీ అర్వింద్‌ను కలిసిన బీజేపీ మండలాధ్యక్షులు

image

నూతనంగా నియమితులైన వివిధ మండలాల అధ్యక్షులు శనివారం హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో బీజేపే ఎదుగుదలకు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొన్నారు.

News January 11, 2025

NZB: అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం

image

గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశానిర్దేశం చేశారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని సూచించారు.

News January 11, 2025

NZB: 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

నిజామాబాద్‌లో ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి 1వ టౌన్ పరిధిలోని PDS మాఫియా గోదాంలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నిజామాబాద్ నగరంలోని గౌతం నగర్‌కు చెందిన కన్ రాజ్ బాలరాజ్ తన ఆటోలో 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. PDS మాఫీయా నిర్వహకులకు అందజేసేందుకు వెళ్తున్నప్పుడు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.