News December 28, 2024
నిజామాబాద్ పొలిటికల్ రౌండప్ @2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీకి 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలకు 4 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ 3 చోట్ల గెలుపొందిందగా బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించింది. కాగా జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్కు పీసీసీ పదవీ వరించింది. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, బీఆర్ఎస్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిపై మీ కామెంట్
Similar News
News January 1, 2025
కామారెడ్డి: ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి
కామారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం ఆమెను కామారెడ్డి ఏఎస్పీగా నియమించింది. ఈ మేరకు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.
News January 1, 2025
నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకలను ఈ ఏడాది ఘనంగా జరుపుకునేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి నుంచే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక బేకరీలు, స్వీట్స్ షాపులతో పాటు చికెన్, మటన్ షాపులు కళకళలాడుతున్నాయి. మహిళలు రంగు రంగుల రంగవల్లులతో రేపు వాకిళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు సంబంధించిన రంగులను కొనుగోలు చేస్తున్నారు.
News December 31, 2024
NZB: విషాదం.. రెండంతస్తుల భవనంపై నుంచి పడి మహిళ మృతి
బట్టలు ఆరేయడానికి వెళ్లి భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు తెలిపారు. బోర్గాం(పి)కి చెందిన కాలూరి నిహారిక (32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం సాయంత్రం రెండంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.