News February 2, 2026
నిజామాబాద్: ఫిబ్రవరి 5లోపు దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్ నాగారంలోని తెలంగాణ మైనారిటీ బాలుర జూనియర్ కళాశాలలో ఐఐటీ, నీట్, క్లాట్, సీఏ ఉచిత కోచింగ్‌తో పాటు ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో అడ్మిషన్ల కోసం ఫిబ్రవరి 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ హైదర్ తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరి 5లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.