News May 17, 2024

నిజామాబాద్: ఫోన్ కోసం రైలు నుంచి దూకేశాడు

image

ఫోన్ కోసం ఓ యువకుడు రైలు నుంచి దూకేశాడు. వివరాలిలా.. అబ్దుల్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే అతని ఫోన్‌ కిందపడింది. దాని తీసుకునేందుకు వెంటనే రైలు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలి పాదం నుజ్జునుజ్జయింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి చికిత్స కోసం NZMకు తరలించారు. ఫోన్ తెచ్చి ఇచ్చేవరకు చికిత్సకు వెళ్లనని మారాం చేశాడు. ఫోన్‌ మాత్రం దొరకలేదు.

Similar News

News January 25, 2025

ఆర్మూర్: ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.

News January 25, 2025

ఆర్మూర్: డాక్టర్ లక్ష్మణ్‌ను కలిసిన పల్లె గంగారెడ్డి

image

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గంగారెడ్డి పసుపు బోర్డు ఛైర్మన్ ఎన్నికకు సహకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు, పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.

News January 25, 2025

ఆర్మూర్ : ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.