News April 27, 2024
నిజామాబాద్: బండరాయితో భర్తను హత్య చేసిన భార్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం మద్యం సేవించి వేధిస్తున్న భర్తను భార్య హతమార్చింది. ఈ ఘటన మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని వడ్డెర కాలనీలో జరిగింది. బోధస్ లక్ష్మణ్(35) అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా అతని భార్య లక్ష్మీ బండరాయితో తలపై మోది హత్య చేసింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన లక్ష్మీ బండరాయితో కొట్టి హత్య చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News January 10, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి:DMHO
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పీహెచ్సీ వైద్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, లక్ష్యం మేరకు ఓపీ సేవలందించాలని సూచించారు. ఆసుపత్రిలోకి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రతి ఓపిని టార్గెట్‌కు అనుగుణంగా చూడాలని తెలిపారు.
News January 10, 2025
ఆర్మూర్: హత్య కేసు UPDATE.. ముగ్గురు కొట్టడంతోనే మృతి
ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాత్రి సమయంలో కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ, బడే రవి లు డబ్బుల విషయంలో మృతుడు మైలారపు సోమేశ్@ సాయిలు (60) గొడవపడి, బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలిందని ఆర్మూర్ సీఐ తెలిపారు.
News January 10, 2025
టీయూ: పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. ఆమె మాట్లాడుతూ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac.in ను సందర్శించాలన్నారు. విద్యార్థులు గమనించాలని తెలిపారు.