News October 31, 2024

నిజామాబాద్: బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు

image

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు విధించారు. బోయిన్‌పల్లి CI, SI వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సాయిలు సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ హౌస్‌కింపింగ్ చేసే వ్యక్తి కూతురిపై 2019లో సాయిలు పలుసార్లు అత్యాచారం చేశాడు. 2020లో బాలిక గర్భందాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.

Similar News

News July 9, 2025

NZB: CPను కలిసిన కొత్త ఎస్ఐలు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు చేపట్టిన ఎస్ఐలు ఇవాళ సీపీ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు.

News July 8, 2025

రైల్‌రోకో కేవలం ట్రైలరే: MLC కవిత

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్‌రోకోను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.

News July 8, 2025

బోధన్: పథకాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.