News January 13, 2025
నిజామాబాద్: బాలుడి గొంతుకోసిన చైనా మాంజా
చైనా మాంజా కమ్మర్పల్లిలో కలకలం రేపింది. సోమవారం ఓ వ్యక్తి గాలిపటం ఎగరవేయగా అది తెగిపోయింది. దానికి కట్టిన చైనా మాంజా ఓ బాలుడి(9) గొంతుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రులు మీ పిల్లలు బయట ఆడుకునేటప్పుడు గమనిస్తూ ఉండండి. ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
Similar News
News January 15, 2025
NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్
తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.
News January 15, 2025
NZB: పసుపు బోర్డుతో అందరికీ లాభం: MP అర్వింద్
పసుపు బోర్డుతో కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతులకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
News January 15, 2025
తాడ్వాయి: గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులకు ఆహ్వానం
తాడ్వాయి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం సురేఖ తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.