News March 14, 2025
నిజామాబాద్: బాల్యంలో ఈ పూలతోనే హోలీ..!

నిజామాబాద్ జిల్లాలో ఆ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
Similar News
News November 28, 2025
వనపర్తి: చిన్న నీటి వనరుల గణనకు శిక్షణ

వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో చిన్న తరహా నీటి వనరుల గణన కోసం ఎన్యూమరేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ హరికృష్ణ, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అదనపు కలెక్టర్ శ్రావ్య పాల్గొని సూచనలు చేశారు. కేంద్ర జల వనరుల శాఖ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ ఎన్యూమరేషన్ను జాగ్రత్తగా పూర్తి చేయాలని వారు కోరారు. ఈ శిక్షణకు ఏఈవోలు, జీపీవోలు, ఎఫ్ఏలు, టీఏలు హాజరయ్యారు.
News November 28, 2025
స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.
News November 28, 2025
కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.


