News August 3, 2024
నిజామాబాద్: బ్యాంకు మేనేజర్ అరెస్ట్

UNION బ్యాంక్‌లో అవకతవకలకు పాల్పడిన మాజీ సీనియర్ మేనేజర్‌అరెస్టయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని బ్యాంకు బడాబజార్ సీనియర్ మేనేజర్ అజయ్ ఖాతాదారులను నమ్మించి రూ.3కోట్లు వసూలు చేశారు. వారి హామీపత్రాలను వాడుకొని డబ్బులు తీసుకున్నాడు. మోసపోయిన బాధితుల్లో ఒకరు జులై 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అజయ్‌ను శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు.
Similar News
News December 14, 2025
సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
News December 14, 2025
నిజామాబాద్: సర్పంచ్‌గా తొలి విజయం మహిళదే

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మోపాల్ మండలం శ్రీరాంనగర్‌తండా సర్పంచ్‌గా గుగులోత్ సరోజ 84 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బస్సీ సునీతపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఉపసర్పంచ్ ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు.
News December 14, 2025
నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.


