News November 26, 2024
నిజామాబాద్: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్
న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. NZBకి చెందిన కాంత్రికుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. కాగా, తన 18 నెలల కూతురు నేహశ్రీ మానసిక అనారోగ్యంతో రెండు సార్లు ఆపరేషన్ చేయించాడు. అయినా కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది నేహశ్రీతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
Similar News
News December 4, 2024
నిజామాబాద్: మీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయా?
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ 3 సెకన్ల పాటు భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.
News December 4, 2024
పిట్లం: హైవే (161) కన్నీరు పెడుతోంది..! పట్టించుకోరా?
ప్రతిఒక్కరూ తమ ఊరికి మంచి రహదారి ఉండాలనుకోవడం సహజం. కానీ జుక్కల్ నియోజకవర్గ వాసులు హడలిపోతున్నారు. ఆ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో హైవే అధికారుల నిర్లక్ష్యం, కొంత మేర వాహనదారుల నిర్లక్ష్యంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్లం వద్ద హైవే పై కారుకు గేదెలు అడ్డు రావడంతో కారు బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.
News December 4, 2024
NZB: మెప్మా మహిళా సంఘాలకు భారీగా రుణాలు పంపిణీ
నిజామాబాద్ నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం అర్బన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. 128 స్వయం సహాయక సంఘాలకు రూ. 10.52 కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 32 మంది సభ్యులకు కోటి రూపాయల చెక్కు పంపిణీ చేశారు. వీధి విక్రయదారులకు స్వనిధి పథకం కింద 50 మందికి రూ. 15 లక్షల ఆర్థిక తోడ్పాటు అందించారు.