News February 25, 2025

నిజామాబాద్: భార్య తిట్టిందని భర్త ఫిర్యాదు

image

వేరే వ్యక్తి ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడిగినందుకు భార్య తిట్టిందని భర్త ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రకారం.. ఇంద్రసేనారెడ్డి భార్యతో రాగన్నగూడలో ఉంటున్నాడు. భార్య NZB జిల్లా భోదన్‌లోని ఓ గ్రామంలో జీపీ కార్యదర్శిగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఈ క్రమంలో 23న భార్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. కాసేపటికి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పరార్ అవ్వడంతో ప్రశ్నించగా, ఆమె తిట్టిందని తెలిపారు.

Similar News

News December 24, 2025

NZB: యాసంగికి నీటిని విడుదల చేసిన కొత్త సర్పంచులు

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల సాగు కోసం బుధవారం లక్ష్మీ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గేట్లు ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎస్సారెస్పీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వి.జగదీష్ మాట్లాడుతూ.. ‘సివామ్‌’ (SCIWAM) కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారాబంది పద్ధతిలో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

News December 24, 2025

NZB: గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న నిర్వహించనున్నట్లు NZB జిల్లా గురుకుల పాఠశాలల సీనియర్ ప్రిన్సిపల్ గోపిచంద్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 21లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News December 24, 2025

నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్: వర్ని SI

image

వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వర్నిSI రాజు తెలిపారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతో పాటు అతని తమ్ముడు నరేడ్ల శంకర్, అఫంధి ఫారానికి చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్, ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9.86 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.