News January 11, 2026

నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

image

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News January 17, 2026

NZB: వరుసగా మూడోసారి మేయర్ పదవి మహిళ (జనరల్)కే

image

త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు పర్యాయాలు మహిళ (జనరల్)కు రిజర్వ్ అవగా BRS నుంచి ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని చేపట్టారు. ఈ పర్యాయం BJP, కాంగ్రెస్, BRS, MIM పార్టీలు మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

News January 17, 2026

NZB: 60 డివిజన్లు కాంగ్రెస్, బీజేపీ నుంచి 500 మంది ఆశావహులు

image

NZB కార్పొరేషన్లో పోటీకి వందలాది ఆశావహులు రెడీ అయ్యారు. 60 డివిజన్లలో కేవలం రెండు ప్రధాన పార్టీల్లోనే 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి 300 మంది బీజేపీ నుంచి 200 మంది టికెట్లకు అప్లై చేశారు. ఎవరి రూట్లో వారు టికెట్ల లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికే 14 మందికి మీకే టికెట్ అని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రిజర్వేషన్లు రాగానే వారి పేర్లు ప్రకటించే ప్లాన్ చేసింది బీజేపీ.

News January 17, 2026

నిజామాబాద్‌లో సైబర్ మోసం

image

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.