News March 14, 2025
నిజామాబాద్: మనిషి పుర్రె, ఎముకల కలకలం

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల శివారులో గురువారం మనిషి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయని ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. గాంధీనగర్‌కి చెందిన వ్యక్తులు పని నిమిత్తం బినోల శివారు అడవిలోకి వెళ్లగా మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయన్నారు. గాంధీనగర్ కారోబార్ చింతల మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో స్థానికంగా ఎవరైనా అదృశ్యమయ్యారా విచారణ చేస్తామన్నారు.
Similar News
News March 16, 2026
అమలాపురం: రూ.7 కోట్ల మోసం.. నిందితులకు జైలు శిక్ష

అమలాపురంలో సుమారు 1600 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు చేసి మోసగించిన ఓ సంస్థ ఎండీకి 7 ఏళ్లు, డైరెక్టర్లకు 5 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి గందం సునీత తీర్పునిచ్చారు. నిందితులకు మొత్తం రూ.48.60 లక్షల జరిమానా విధించారు. పాత కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ అభినందించారు.
News March 16, 2026
గుంతకల్: కూతురు పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి తల్లి మృతి

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో సోమవారం బైక్ బోల్తా పడి అక్బర్ బీ మృతి చెందింది. గుత్తికి చెందిన అక్బర్ బీ తన కుమార్తె పెళ్లి పత్రికలు పంచడానికి మేనల్లుడు మహబూబ్ బాషాతో కలిసి బైక్‌పై గుంతకల్లుకు వెళ్లింది. అక్కడ బంధువులకు పత్రికలు పంచి గుత్తికి ప్రయాణమయ్యారు. పాత కొత్త చెరువు సమీపంలో బైక్ బోల్తా పడింది. ఇద్దరూ గాయపడ్డారు. అక్బర్ బీ కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందింది.
News March 16, 2026
నల్గొండ: దివ్యాంగుల కోసం ప్రతి నెలాఖరున ‘ప్రత్యేక ప్రజావాణి’

దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నెల 28న దీన్ని ప్రారంభిస్తున్నామని, దీనికి అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రంజాన్ తోఫా పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


