News April 10, 2024
నిజామాబాద్: మరో 6 రోజులే గడువు

ఈనెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, దృవీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక బీల్వోకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మార్పులు కూడా చేసుకోవచ్చు.
Similar News
News March 5, 2025
నిజామాబాద్: ఎమ్మెల్సీ కౌంటింగ్.. 23 మంది ఎలిమినేట్

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అధికారులు చేయనున్నారు. లెక్కింపునకు ముందు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికి 23 స్వతంత్ర అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అని అధికారులు తెలిపారు.
News March 5, 2025
UPDATE: అవమానించడని కత్తితో దాడి

నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్‌లో నిన్న ఒకరిపై కత్తిపోట్లు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తనతో పాటు తన కుమారులను అవమానించాడన్న కోపంతో గాజుల్ పేట్‌కు చెందిన సంతోష్ అనే వ్యక్తిపై తన స్నేహితుడైన మహేష్ కత్తితో దాడి చేశాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు.
News March 5, 2025
నిజామాబాద్: అలీసాగర్ లిఫ్ట్ కాల్వలో శవం లభ్యం

ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల అలీసాగర్ లిఫ్ట్ కాల్వ తూము వద్ద వ్యక్తి శవం లభ్యమవడం కలకలం లేపింది. అలీసాగర్ లిఫ్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.