News October 26, 2024

నిజామాబాద్: మోసం చేస్తున్న మహిళలు

image

ఇద్దరూ మహిళలు నమ్మించి మోసం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి నరదిష్టి ఉంది అంటూ నగదు స్వాహా చేస్తున్నారు. వీరి మీద హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట పలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News October 10, 2025

స.హ. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

సమాచార హక్కు చట్టాన్ని(ఆర్టీఐ) పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆర్టీఐ చట్టం ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం చట్టం అమలుకై అధికారులచే ప్రమాణం చేయించారు.

News October 9, 2025

మోస్రా: నామినేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

మోస్రాలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. నామినేషన్‌లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ పాల్గొన్నారు.

News October 9, 2025

ధర్పల్లి: బడికి ఫోన్ తీసుకెళ్లాడని విద్యార్థికి TC

image

పాఠశాలకు సెల్ ఫోన్‌ తీసుకెళ్లాడని ఓ విద్యార్థికి TC ఇచ్చిన ఘటన ధర్పల్లి(M) దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాలలో బతుకమ్మ ఆడే సమయంలో సెల్ ఫోన్‌లో ఫొటోలు తీశాడు. దీంతో HM శశికళ విద్యార్థిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఈనెల 8న విద్యార్థికి TC ఇచ్చింది. పాఠశాలలో చేర్చుకోవాలని తండావాసులు గురువారం పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.