News April 11, 2024

నిజామాబాద్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలో నియమనిష్ఠలతో నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Similar News

News October 23, 2025

నిజామాబాద్‌లో ధాన్యం సేకరణ ఏర్పాట్లు భేష్: ఎండీ లక్ష్మి

image

ఖరీఫ్ వరి ధాన్యం సేకరణ కోసం నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు అభినందనీయమని స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ (MD) లక్ష్మి (ఐఏఎస్) అన్నారు. బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ, సొసైటీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లను ఆమె ప్రశంసించారు.

News October 22, 2025

NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.

News October 22, 2025

కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం: ఎమ్మెల్సీ కవిత

image

కొమురం భీం నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.