News August 5, 2024
నిజామాబాద్: రక్తం మరిగిన కుక్కలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి కుక్కలు రోడ్డుపై తిరుగుతుండటంతో ఒంటరిగా కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి 44పై కుక్కటు గుంపులు గుంపులుగా సంచారిస్తుడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను తప్పించాలని కోరుతున్నారు.
Similar News
News September 15, 2024
గణేష్ మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్పాల్
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
News September 14, 2024
NZB: గణేశ్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.
News September 14, 2024
బాల్కొండ: మిస్ అయిన బాలుడి హత్య..!
నాలుగు రోజుల క్రితం మిస్ అయిన బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి కచ్చు రాకేష్ (12) మృతదేహం శనివారం బాల్కొండలోని పురాతన ఖిల్లా వద్ద హత్యకు గురైన స్థితిలో లభ్యమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. చిట్టాపూర్ గ్రామానికి చెందిన కచ్చు బాను, లక్మయ్యల కుమారుడైన రాకేశ్ 4 రోజుల క్రితం అదృశ్యమవగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.