News April 25, 2024
నిజామాబాద్: రేపటి నుంచి పరీక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. పరీక్షలు ఏప్రిల్ 25న ప్రారంభమై మే 2 వరకు కొనసాగుతాయన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 న ప్రారంభమై అదే నెల 10 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.
News February 8, 2026
NZB: బందోబస్తుతో కౌంటింగ్ హాల్‌కు తరలించాలి: కలెక్టర్

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం పరిశీలించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్‌కు తరలించాలని ఆదేశించారు.
News February 8, 2026
NZB: ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం సందర్శించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో ఏర్పాట్లను అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.


