News June 14, 2024
నిజామాబాద్: రైల్వేస్టేషన్లో గొడవ.. ఒకరి మృతి

నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఇద్దరు మధ్యలో జరిగిన గొడవలో ఒకరు మృతిచెందినట్లు శుక్రవారం రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం1లో నాందేడ్‌కు చెందిన సతీశ్‌శర్మ, రాజు ఇద్దరు గొడవపడ్డారు. ఈ గొడవలో సతీష్‌శర్మ, రాజును నెట్టివేశాడు. దీంతో రాజు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.
Similar News
News December 11, 2025
నిజామాబాద్ జిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం

మోస్రా మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ సర్పంచిగా లునావత్ శివ 114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 254 ఓట్లు పోలయ్యాయి. 184 ఓట్లు గెలుపొందిన అభ్యర్థి లునావత్ శివకుమార్‌కు రాగా ప్రత్యర్థి వీరన్నకు 70 ఓట్లు పోలయ్యాయి. భారీ విజయంతో సర్పంచి పీఠం లునావత్ శివ కైవసం చేసుకోవడంతో గ్రామంలో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 11, 2025
కామారెడ్డి జిల్లాలో 5 ఓట్ల తేడాతో తొలి విజయం

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాగ్యమ్మ విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి లక్ష్మీపై ఐదు ఓట్ల తేడాతో భాగ్యమ్మ విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచారం కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.
News December 11, 2025
నిజామాబాద్‌లో పోలింగ్ శాతం ఎంత అంటే?

తొలి దశ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మధ్యాహ్నం1 గంట వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 84.88%, చందూరు-79.95%, కోటగిరి-78.05%, మోస్రా-76.09%, పొతంగల్- 82.21%, రెంజల్- 80.91%, రుద్రూరు-84.05%, సాలూర-85.91%, వర్ని-78.74%, ఎడపల్లి-67.11%, నవీపేట-76.78% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


