News June 14, 2024
నిజామాబాద్: రైల్వేస్టేషన్లో గొడవ.. ఒకరి మృతి
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మధ్యలో జరిగిన గొడవలో ఒకరు మృతిచెందినట్లు శుక్రవారం రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం1లో నాందేడ్‌కు చెందిన సతీశ్‌శర్మ, రాజు ఇద్దరు గొడవపడ్డారు. ఈ గొడవలో సతీష్‌శర్మ, రాజును నెట్టివేశాడు. దీంతో రాజు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై తెలిపారు.
Similar News
News September 13, 2024
పిట్లం: తల్లి దండ్రులు మందలించారని సూసైడ్
తల్లి దండ్రులు మందలించారని మనస్తాపంతో కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పిట్లం మండలం తిమ్మానగర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు వివరాలిలా.. తిమ్మనగర్ వాసి బొమ్మల నాందేవ్ (23) పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు మందలించగా.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News September 13, 2024
NZB: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు: DEO
నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
News September 13, 2024
ఆర్మూర్: 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజ
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్మి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గణేశ్ మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కాలనీలోని మహిళలు 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించారు. కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.