News July 19, 2024

నిజామాబాద్: లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

image

నగరంలోని లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు లాడ్జీలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా వాటిని నిరోధించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, టౌన్ సీఐ నరహరి, మహిళా సీఐ శ్రీలత, నాలుగవటౌన్ ఎస్ఐ పాండేరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 20, 2025

బోధన్: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు

image

బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.

News December 20, 2025

NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.

News December 20, 2025

NZB: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

image

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌లో 9, బోధన్‌లో 4, ఆర్మూర్‌లో 2 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.