News February 25, 2025

నిజామాబాద్: వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, నాబార్డు డీడీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2025

నిజామాబాద్: భార్య తిట్టిందని భర్త ఫిర్యాదు

image

వేరే వ్యక్తి ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడిగినందుకు భార్య తిట్టిందని భర్త ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రకారం.. ఇంద్రసేనారెడ్డి భార్యతో రాగన్నగూడలో ఉంటున్నాడు. భార్య NZB జిల్లా భోదన్‌లోని ఓ గ్రామంలో జీపీ కార్యదర్శిగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఈ క్రమంలో 23న భార్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. కాసేపటికి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పరార్ అవ్వడంతో ప్రశ్నించగా, ఆమె తిట్టిందని తెలిపారు.

News February 25, 2025

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మరణించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. భవానిపేట వాసి మాగిరి లింగారం(57) తన ద్విచక్ర వాహనంపై చేపలను అమ్మి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేశ్ తెలిపారు.

News February 25, 2025

NZB: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు: ఆర్ ఎం

image

మహా శివరాత్రి పురస్కరించుకొని ఈ నెల 25, 26, 27 తేదీల్లో NZB, KMR, ఆర్మూర్ నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ RM జ్యోత్స్న సోమవారం తెలిపారు. మొత్తం రీజియన్ పరిధిలో 136 బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయానికి, మద్దికుంట బుగ్గ లింగేశ్వర, కొమురవెల్లి మల్లన్న సన్నిధికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని, ఈసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!