News February 20, 2025
నిజామాబాద్: విషాదం.. మృతులంతా ఒకే FAMILY

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామ శివారులో పొలాల్లో గురువారం ఉదయం కరెంట్ షాక్తో <<15520125>>ముగ్గురు మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓర్సు గంగారాం(45), బాలమణి (40) వారి కొడుకు కిషన్(22) ఉదయం పంట పొలంలో వరికి నీరు పెట్టేందుకు వెళ్లగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు మృతిచెందినట్లు భావిస్తున్నారు.
Similar News
News December 9, 2025
చలికాలం కదా అని!

చలికాలంలో చాలామంది నీరు తాగడంపై అశ్రద్ధ వహిస్తారు. అయితే ఈ కాలంలోనూ డీహైడ్రేషన్ ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘డైలీ 6-9 గ్లాసుల నీళ్లు తాగాలి. వాటర్ తాగాలని అనిపించకపోతే సూప్లు, టీలు తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ప్లూయిడ్ అంది జీవక్రియ మెరుగవుతుంది’ అని చెబుతున్నారు. అలాగే శరీరాన్ని స్వెటర్లతో కప్పి ఉంచకుండా సూర్యరశ్మి పడేలా చూసుకుంటే D-విటమిన్ అందుతుందని సూచిస్తున్నారు.
News December 9, 2025
IPL మినీ వేలం.. 350 మందితో ఫైనల్ లిస్ట్

IPL మినీ వేలంలో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి 1,355 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఆ లిస్టును BCCI 350 మందికి కుదించింది. ఈ లిస్టులో తొలుత పేరు నమోదు చేసుకోని 35 మంది కొత్త ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ.కోటిగా నిర్ణయించారు. DEC 16న 2.30PMకు అబుదాబి వేదికగా IPL వేలం జరగనుంది.
News December 9, 2025
సంగారెడ్డి: నేడు మొదటి విడత ప్రచారానికి ముగింపు

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు ఊరేగింపులు ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదన్నారు.


