News May 20, 2024

నిజామాబాద్: హోటళ్లలో తనిఖీలు

image

నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ అనురాగ్, డిప్యూటీ కమిషనర్ల ఆదేశాల మేరకు నగరంలోని పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్ యజమానులకు కిచెన్, ఇతర సెక్షన్స్‌లలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. లేదంటే పెనాల్టీలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్‌తో పాటు ప్రభుదాస్, సునీల్, శ్రీకాంత్, ప్రశాంత్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

NZB: 1,760 వార్డులకు 3,764 నామినేషన్లు దాఖలు

image

జిల్లాలో జరగబోయే 2వ విడత GP 1,760 వార్డు మెంబర్ల (WM) పదవులకు 240 నామినేషన్లు రాగ మొత్తం 3,764 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 194 WMలకు 417, డిచ్పల్లి(M) 306 WMలకు 621, ఇందల్ వాయి(M) 198 WMలకు 412, మాక్లూర్ (M) 230 WMలకు 466, మోపాల్ (M) 192 WMలకు 425, NZB రూరల్(M) 172 WMలకు 348, సిరికొండ (M) 264 WMలకు 583, జక్రాన్ పల్లి (M) 204 WMలకు 492 నామినేషన్లు వచ్చాయి.

News December 3, 2025

NZB: రెండో విడత సర్పంచ్ పదవులకు 1,178 నామినేషన్లు

image

NZB జిల్లాలో జరగబోయే రెండో విడత GP ఎన్నికల సర్పంచ్ పదవులకు మంగళవారం 196 నామినేషన్లు రాగ మొత్తం 1,178 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 22 GP లకు 114, డిచ్పల్లి(M) 34 GPలకు 183, ఇందల్వాయి(M)23 GPలకు 136, మాక్లూర్ (M)26 GPలకు 161, మోపాల్ (M) 21 GPలకు 158, NZB రూరల్(M) 19 GPలకు 113, సిరికొండ (M)30 GPలకు 148, జక్రాన్ పల్లి (M) 21 GPలకు 165 నామినేషన్లు వచ్చాయన్నారు.

News December 2, 2025

NZB: రెండో రోజూ 1,661 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్‌లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZBరూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం 196 సర్పంచి స్థానాలకు 456, 1760 వార్డు స్థానాలకు 1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.