News September 6, 2024

నిజామాబాద్: 100కు డయల్.. వ్యక్తికి జైలు

image

డయల్ 100కు తరచూ ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ 3 రోజుల జైలుశిక్ష విధించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అప్రోజ్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ తరచూ డయల్ 100కు ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ అప్రోజ్‌ను అదుపులోకి తీసుకొని, ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా మూడురోజుల జైలు శిక్ష విధించినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News December 12, 2025

నిజామాబాద్ జిల్లాలో 7.3°C అత్యల్ప ఉష్ణోగ్రత

image

NZB జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో సాలుర 7.3°C, చిన్న మావంది 7.6, కోటగిరి 8.3, జకోరా, గోపన్నపల్లి 8.9, పొతంగల్ 9, కల్దుర్కి 9.2, మదన్ పల్లె 9.5, చందూర్, మంచిప్ప 9.6, బెల్లాల్ 9.7, డిచ్‌పల్లి, మోస్రా 9.8, ఎడపల్లి, మెండోరా, రుద్రూర్ 9.9, నవీపేట్, పాల్దా, నిజామాబాద్, గన్నారం 10°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

News December 12, 2025

NZB: నేటి నుంచి నిషేధాజ్ఞలు: CP

image

ఈ నెల 14 న నిజామాబాద్ డివిజన్‌లో నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం శుక్రవారం నుంచి 163 BNSS ఉత్తర్వులు జారీ చేసినట్లు CPసాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్‌లోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు.

News December 12, 2025

ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

image

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.