News September 6, 2024
నిజామాబాద్: 100కు డయల్.. వ్యక్తికి జైలు
డయల్ 100కు తరచూ ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేసిన ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ 3 రోజుల జైలుశిక్ష విధించారు. నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్ అప్రోజ్ అనే వ్యక్తి మద్యం సేవిస్తూ తరచూ డయల్ 100కు ఫోన్ చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో ఎస్ఐ శ్రీకాంత్ అప్రోజ్‌ను అదుపులోకి తీసుకొని, ఈరోజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా మూడురోజుల జైలు శిక్ష విధించినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News October 13, 2024
NZB: డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ వర్సిటీ విద్యార్థులు
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 8 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా అందులో 6 గురు SGT, ఇద్దరు SA కొలువులు సాధించారు.ఉద్యోగాలు సాధించిన వారిలో గణపురం సుశీల(SGT), సదాలి నరేష్(SGT), గైని రాజు(SGT), అన్నాడి అజయ్ కుమార్(SGT), M.శ్రీశైలం(SGT), మొహ్మద్ ఖాజా(SGT), నంద అనిల్ (SA సోషల్), దేవసోత్ చందర్ రాథోడ్(SAసోషల్) ఉన్నారు.
News October 12, 2024
NZB: దసరా వేడుకల్లో దిల్ రాజు, సినీ హీరో ఆశిష్
NZB జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ హీరో ఆశిష్ పాల్గొన్నారు. వేద పండితుల మధ్యన శమి వృక్షానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని పల్లకీ మోశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, విజయ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News October 12, 2024
పండగ వేళ బోధన్‌లో కత్తిపోట్లు
దసరా పండగ వేళ బోధన్ పట్టణంలోని గాంధీనగర్‌లో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. కాలనీకి చెందిన రేహాన్, జావిద్, బబ్లు ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వెళ్తున్న మన్సుర్ తన గురించే వారు మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులు కేసు, దర్యాప్తు చేస్తున్నారు.