News January 17, 2025
నిజామాబాద్: 20వ తేదీ నాటికి అర్హుల జాబితాలను రూపొందిస్తాం: కలెక్టర్

20వ తేదీ నాటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందిస్తామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 21 నుంచి వరకు ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభల్లో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపిస్తామన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేస్తామన్నారు.
Similar News
News November 20, 2025
మదనపల్లెలో 10 కిలోల టమాటాలు రూ.610

మదనపల్లెలో టమాటా ధరలు పైపైకి పోతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్కు గురువారం 135 మెట్రిక్ టన్నుల టమాటాలు మాత్రమే వచ్చాయి. 10 కిలోల మేలు రకం టమాటాలు రూ.610 అమ్ముడు పోగా.. రెండవ రకం రూ.580, మూడవ రకం రూ.500లతో కొనుగోలు జరుగుతున్నట్లు టమాటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. పంట దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు వారు తెలిపారు.
News November 20, 2025
శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.
News November 20, 2025
గృహ నిర్మాణాల్లో ప్రజల సంతృప్తే గీటురాయి: కలెక్టర్

గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవడం ఒక కల అని, దానిని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. వివిధ స్థాయిలలో ఉన్న గృహా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.


