News January 17, 2025

నిజామాబాద్: 20వ తేదీ నాటికి అర్హుల జాబితాలను రూపొందిస్తాం: కలెక్టర్

image

20వ తేదీ నాటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందిస్తామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 21 నుంచి వరకు ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభల్లో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపిస్తామన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు.

Similar News

News February 10, 2025

వికారాబాద్: స్థానిక సంస్థల స్థానాలు ఇవే..!

image

వికారాబాద్ జడ్పీ ఛైర్మన్ సీటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కన్నేశారు. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ZPTC స్థానాలు- 20, MPP- 20, MPTC- 227, గ్రామ పంచాయతీలు- 594, వార్డులు- 5,058 ఉన్నాయి. రేపు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా వెలువడనుంది. అభ్యంత్రాల అనంతరం 15న కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా విడుదలవుతుంది.

News February 10, 2025

కామెడీ షోలో బూతులు.. పోలీసులకు ఫిర్యాదు

image

కామెడీ షోలో అసభ్యంగా బూతులు మాట్లాడిన వారిపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, ఇన్‌ఫ్లూయెన్సర్ అపూర్వ మఖీజా, కమెడియన్ సమయ్ రైనా అనుచిత పదజాలాన్ని ఉపయోగించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. బూతులే కామెడీ అనుకుంటున్నారా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News February 10, 2025

విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?

image

AP: గుంటూరు సీఐడీ విచారణకు నేడు డైరెక్టర్ RGV గైర్హాజరయ్యారు. దీంతో రేపు మళ్లీ నోటీసులివ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని RGV 8 వారాల సమయం కోరారు. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదిని CID కార్యాలయానికి పంపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై TDP నేతల ఫిర్యాదు మేరకు CID ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!