News March 12, 2025
నిజామాబాద్: 25 శాతం రిబేట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

లేఔట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కోసం మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రిబేటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 25 శాతం రాయితీ పొందాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎల్ఆర్ఎస్ అనుమతులు లేని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
NZB: ఈనెల 25న జాబ్ మేళా

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి.ఫార్మా, డి.ఫార్మా, ఎం.ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.
News February 24, 2026
NZB: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి

రేపటి నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక 8 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక హెచ్పీసీ, ముగ్గురు డీఈసీ సభ్యులు పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
News February 24, 2026
నవీపేట: దూడను చంపిన చిరుత పులి

నవీపేట్ మండలంలోని అబ్బపూర్ (ఎం)లో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. బెల్లిడిగే అబ్బన్న అనే రైతు పశువుల పాకపై దాడి చేసిన చిరుత, ఒక దూడను చంపేసింది. సోమవారం ఉదయం యజమాని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీట్ అధికారులు జాహుర్, సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అడుగుజాడలను సేకరించారు. వెటర్నరీ డాక్టర్ నరేందర్ రెడ్డి దూడకు పోస్టుమార్టం నిర్వహించారు.


