News May 11, 2024
నిజామాబాద్: 3 వేల పైచిలుకు మందితో భద్రత

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా నిజామాబాద్ జిల్లా పరిధిలో 3 వేల పైచిలుకు మందితో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను మోహరిస్తామన్నారు. 7 కంపెనీల కేంద్ర బలగాలు, ఐదు కంపెనీల టీఎస్ఎస్పీ బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయని వివరించారు.
Similar News
News November 23, 2025
NZB: సాధారణ కార్యకర్త నుంచి డీసీసీ అధ్యక్షుడిగా..!

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నగేష్ రెడ్డి నియమితులయ్యారు. రూరల్ మండలం మోపాల్కు చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అంచలంచెలుగా ఎదిగారు. పీసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన, చివరకు భూపతి రెడ్డికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది.
News November 23, 2025
త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తా: జీవన్ రెడ్డి

త్వరలో నిజామాబాద్ జిల్లా అంతటా పర్యటించి,స్థానిక పోరుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆపద కాలంలో పార్టీ కోసం పోరాడుతున్న గులాబీ శ్రేణులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను గ్రామగ్రామాన ఎండగడతామని అన్నారు.
News November 23, 2025
నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని నిజామాబాద్ గడ్డ నుంచే శాసిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు.


