News January 30, 2025
నిజామాబాద్: 31న సాగునీటి ప్రాజెక్టులపై జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేయడానికి ఈ నెల 31న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసం చేయనున్నారని కార్యకర్తలు వెల్లడించారు.
Similar News
News February 19, 2025
నిజామాబాద్: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే నియోజకవర్గాలు చాలా పెద్ద పరిధి కలిగి ఉంటుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుస్తూ ప్రచారం చేయడం పెద్ద సవాలే. అయితే ఇప్పుడు అభ్యర్థులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్తగా పోలింగ్ వివరాలు తెలుపుతూ.. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని SMSరూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మీకు మెసేజ్‌లు వస్తున్నాయా..? కామెంట్ చేయండి.
News February 19, 2025
కామారెడ్డి: శ్మశాన వాటికలో యువకుడి ఆత్మహత్య

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్‌లో జరిగింది. SI శివకుమార్ తెలిపిన వివరాలిలు.. మోహన్(28) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, శ్మశానవాటిక వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News February 19, 2025
NZB: స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం కలెక్టర్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్ తో సమావేశమై మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు వారం వారం క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.