News November 5, 2024
నిజామాబాద్: DSP పదవికి రాజీనామా.. MLCగా బరిలో..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన మందనం గంగాధర్ DSP విధులకు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో పట్టభద్రుల MLC అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుసగా 12 PSలకు ఆయన SHOగా విధులు నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 11, 2025
NZB: మొదటి రెండు గంటల్లో 19.80 శాతం పోలింగ్

తొలి దశ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా
బోధన్ మండలంలో 26.26%,
చందూరు-16.63%
కోటగిరి- 17.76%
మోస్రా-15.42%
పోతంగల్- 19.76%
రెంజల్- 23.99%
రుద్రూరు-10.38%
సాలూర- 24.30%
వర్ని-19.62%
ఎడపల్లి-20.48%
నవీపేట -17.07% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.
News December 11, 2025
నిజామాబాద్ జిల్లాలో 7.5°C అత్యల్ప ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో గోపన్నపల్లి 7.5°C,సాలురా 8.0,కోటగిరి 8.2, చిన్న మావంది 8.3, మదన్ పల్లి 8.7,పోతంగల్,మెండోరా,జకోర 8.9, ఏర్గట్ల 9.1,మంచిప్ప,డిచ్ పల్లి, కందుర్కి 9.4, కమ్మర్ పల్లి,నిజామాబాద్ 9.5,గన్నారం 9.7,మోర్తాడ్, కోన సముందర్ 9.8,చందూర్, మోస్రా 9.9°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
News December 10, 2025
1,384 మందితో బందోబస్తు: NZB సీపీ

బోధన్ రెవెన్యూ డివిజన్లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. 1,384 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.


