News November 5, 2024
నిజామాబాద్: DSP పదవికి రాజీనామా.. MLCగా బరిలో..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ DSP విధులకు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో పట్టభద్రుల MLC అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుసగా 12 PSలకు ఆయన SHOగా విధులు నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 7, 2024
NZB: రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి NZB జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయని పార్టీ నేతలంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిపై మీ కామెంట్?
News December 7, 2024
బోధన్: 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన యువకుడు
ప్రేమ పేరుతో ఓ యువకుడు 17ఏళ్ల బాలికను మోసం చేసిన ఘటన బోధన్‌లో చోటుచేసుకుంది. రూరల్ SI మచ్చేందర్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో వినయ్(22)కి పరిచయమయింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆమేను పెళ్లిచేసుకుంటానని చెప్పి చివరికి మోసం చేశాడు. దీంతో బాలిక తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది.
News December 7, 2024
KMR: ‘తప్పులు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి’
ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా చివరి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ప్రతినిధులలో వారం సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా సవరణలపై చర్చించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తదితరులు పాల్గొన్నారు.