News July 20, 2024
నిజామాబాద్: GGHలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతం

నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన మూడేళ్ల బాలుడు అరుణ్ కథ సుఖాంతం అయ్యింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అతణ్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆర్మూర్‌కు చెందిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. కాగా జిల్లా ఆస్పత్రిలో తన తండ్రి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు నిందితులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News November 15, 2025
NZB: ప్రభుత్వ సలహాదారుని కలిసిన ఉద్యోగ సంఘాలు

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి శనివారం వచ్చిన బోధన్ MLA సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
News November 15, 2025
నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

నిజామాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
News November 15, 2025
NZB: 17న జరిగే పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయండి

ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. శనివారం వారు 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల బకాయిల సత్వర చెల్లింపులు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు జరిపే ధర్నా కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. శ్రీధర్, నర్సింహస్వామి, బన్సీలాల్ పాల్గొన్నారు.


